నిజామాబాద్‌లో మరో 3 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 58కి చేరుకున్నాయని కలెక్టర్ తెలిపారు. నిన్న 63 శాంపిల్స్ పంపితే అందులో 57 నెగిటివ్, 3పాజిటివ్ వచ్చాయన్నారు. మరో ముగ్గురి శాంపిల్స్ తిరిగి పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 63 మంది మర్కజ్‌కు వెళ్లి రాగా.. వారిలో 32 మందికి పాజిటివ్ వచ్చింది. మరో 20 మందికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని పేర్కొన్నారు. మర్కజ్ కాంటాక్ట్ వ్యక్తుల్లో మరో 5 కి కరోనా రాగా... దుబాయ్ వెళ్లొచ్చిన వారిలో ఒకరికి కరోనా సోకిందని స్పష్టం చేశారు.
నిజామాబాద్‌లో మరో 3 పాజిటివ్ కేసులు - మెుత్తం కేసులు 58కి చేరుకున్నాయి
నిజామాబాద్ జిల్లాలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా జిల్లాలో మెుత్తం కేసులు 58కి చేరుకున్నాయి.