మోదీ ప్రభుత్వం కార్మిక రంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో 135వ మేడే దినోత్సవ పోస్టర్లను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్లో ఆవిష్కరించారు.
కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సుధాకర్ అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపివేయాలన్నారు. సంస్థలను కాపాడుకోవడానికి కార్మిక రంగం ముందంజలో ఉండి పోరాడాలన్నారు.
కరోనా సంక్షోభ సమయంలో దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాన్ని ఆర్థిక ప్యాకేజీతో ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 135వ మేడే ఉత్సవాలను మే 1 నుంచి వారం పాటు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు విఠల్, గంగాధర్, ఫయాజ్, సంతోశ్, పరమేశ్, నర్సయ్య, పండరి, సాయిలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కట్టడి చర్యలు కఠినంగా అమలు చేయండి: సత్యవతి రాఠోడ్