ETV Bharat / state

చేసేది వ్యవసాయమే కానీ మేము కూలీలం... - RABI CROP

వారు రైతు బిడ్డలు కాదు...వ్యవసాయ పనులు మాత్రం చకచకా చేసేస్తారు. ఎకరం భూమి లేకున్నా రైతులకు తీసిపోరు. బతుకు తెరువు కోసం ఇంటికి దూరంగా...పిల్లలను వసతి గృహాల్లో ఉంచి వ్యవసాయ పనుల కోసం వలసపోతున్నారు.

RABI CROP 1
author img

By

Published : Feb 1, 2019, 9:12 AM IST

RAITHU KOOLI 1
నిర్మల్ జిల్లాలోని రైతులు యాసంగిలో అత్యధికంగా వరి సాగు చేస్తారు. సాగుకు అవకాశమున్నా.. వ్యవసాయ కూలీల సమస్య వేధించింది. రోజురోజుకు కూలీలు తగ్గిన పరిస్థితుల మధ్య రైతులు ఇతర జిల్లాలపై ఆధారపడేవారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలువురికి ఉపాధిగా మారింది. ఇక్కడి నుంచి ఏటా దాదాపు 70 మంది కూలీలు వలసలు వచ్చేవారు. యాసంగి పనులు ప్రారంభం నాటికి వీరంతా వరి నాట్లు వేయడంలో బిజీగా మారుతున్నారు. పిల్లల చదువు, జీవనం కొనసాగాలంటే వలస కూలీకి వెళ్ళక తప్పట్లేదని వాపోయారు.ఏటా నల్గొండ జిల్లా నుంచి రైతు కూలీలు వస్తుంటారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ అలుపు లేకుండా నాట్లు వేయడంతో తమకు ఖర్చు తగ్గి, సమయం కలసి వస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
undefined
రోజు వారి కూలీ రూపంలో కాకుండా ఎకరానికి 3500 చొప్పున తీసుకుంటారు. ప్రతిరోజూ 20 ఎకరాల వరకు నాట్లు వేయడంతో రైతులకు గిట్టుబాటు లభిస్తోంది. అటు కూలీలకూ చేతి నిండా పని దొరుకుతోంది.

Intro:TG_Mbnr_04_31_Nandini_sidha_Reddy_On_Cellphones_AB_C4

( ) నీ లక్ష్యం ఆకాశంవైపు ఉందని చెప్పే అమ్మ... ఇప్పుడు సెల్ ఫోన్ ను చేతిలో పెట్టే పరిస్థితి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతా సెల్ ఫోన్ లోనే ఉందని... సెల్ ఫోన్ లో తలదూర్చి ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న బయటకు రావడం లేదని, ప్రస్తుతం సెల్ ఫోన్ ప్రపంచం నుంచి బయటకు రావాలని ఆయన సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన క్లస్టర్ స్థాయి సాహిత్య విభాగం పోటీలను ఆయన ప్రారంభించారు. సెల్ ఫోన్ ద్వారా పరిజ్ఞానం కొంచెం మాత్రమే తెలుసుకోవచ్చని, జీవితం గురించి తెలుసుకోవాలంటే కచ్చితంగా బయట ప్రపంచం గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, కష్ట నష్టాల గురించి తెలుసుకుంటేనే జీవితంలో రాణించేందుకు వీలు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితులు లేని కారణంగా చిన్న చిన్న ఆటుపోట్లకు విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Body:ఐదు నిమిషాల సమయం దొరికినా సెల్ ఫోన్ కు కేటాయిస్తున్నారని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమయం ఇవ్వడం లేదని అటువంటి వారికి ప్రస్తుతం మంచి స్నేహితుడు కరువయ్యారని, సమస్యలు ఉంటే ధైర్యం చెప్పేవారు లేరన్నారు. తెలుగు రాయడం మాట్లాడటం లో పొరపాట్లు అధికంగా ఉంటున్నాయని, మాతృభాషను ఈ విధంగా మార్చడం ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యార్థులు తెలుగు పై పట్టు సాధించి సాహితివేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Conclusion:బైట్
నందిని సిధారెడ్డి,
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.