నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్ కు చెందిన దొనగిరి సాయి పెళ్లిని ఈ నెల 4న నిశ్చయించారు. పెళ్లి కుమారుడు మోదీకి వీరాభిమాని కావడం వల్ల వివాహ ఆహ్వాన పత్రికపై మోదీ బొమ్మను అచ్చు వేయించాడు. మొట్ట మొదటి సారిగా ఇలా దేశ నాయకుడి ఫొటోతో ప్రింట్ చేసిన పెళ్లి పత్రికను బంధువులు, మిత్రులు ఆసక్తిగా చూస్తున్నారు.
తనకు మోదీ అంటే ఎంతో అభిమానమని, రెండు సార్లు దేశ ప్రధానిగా ప్రజలకు ఎంతో సేవా చేస్తున్నారని అన్నారు. కాగా.. ఈ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవీ చూడండి: స్మార్ట్‌సిటీలో నత్తనడకన సాగుతున్న పార్కుల ఏర్పాటు