నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని వెల్మల్ గ్రామంలో డీ1 పట్టాలపై అక్రమాలు జరిగినట్లు గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ లక్ష్మి రికార్డులను పరిశీలించారు. స్థానిక ఎస్సై ఆసిఫ్‌తో కలిసి విచారణ జరిపారు. డీ2 పట్టాలు... బోగస్ అని తేలితే.. నిందితులపై క్రిమినల్ కేసులు తప్పవని తహసీల్దార్ లక్ష్మీ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ భూముల క్రమబద్ధీకరణ చేసుకోవాలని ఆమె సూచించారు.
వచ్చే బుధవారంలోపు సంబంధిత అన్ని పత్రాలను పరిశీలిస్తామని ఎమ్మార్వో పేర్కొన్నారు. విక్రయించిన, కొనుగోలు చేసిన వ్యక్తి సరైన పత్రాలతో రావాలని.. అక్రమాలు జరిగినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని లక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అంకం గంగామణి, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.