నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మహావీర తాండా శివారు అటవీ ప్రాంతంలో నీలుగాయి(మనువోతు) కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు వన్యప్రాణిని వేటాడినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. అధికారులు అటవీ ప్రాంతానికి వెళ్లి చూడగా నీలుగాయి(మనువోతు) కళేబరం లభించింది. మహావీర తాండా గ్రామానికి చెందినవారే వేటాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వన్యప్రాణి మృతిపై కేసులు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సారంగాపూర్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణి కళేబరం - Unknown people who hunted wildlife in nirmal dist
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మహావీర తాండా శివారులో గుర్తు తెలియని వ్యక్తులు నీలుగాయిని వేటాాడారు. స్థానికుల సమాచారం మేరకు నీలుగాయి కళేబరాన్ని అధికారులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.