ETV Bharat / state

తుడుం దెబ్బ జిల్లా నాయకుల ముందస్తు అరెస్ట్​

నిర్మల్​ జిల్లా కేంద్రంలో జీవో నంబర్​ 3 రద్దును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన తుడుం దెబ్బ జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జీవో నంబర్​ 3 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునఃసమీక్షించుకోవాలని నాయకులు డిమాండ్​ చేశారు.

tudum debba leaders arrested in nirmal district
తుడుందెబ్బ జిల్లా నాయకుల అరెస్టు
author img

By

Published : Jun 9, 2020, 3:00 PM IST

Updated : Jun 9, 2020, 3:05 PM IST

జీవో నంబర్ 3పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర బంద్​ను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. తుడుందెబ్బ నిర్మల్ జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు. అరెస్టులకు బెదిరేది లేదని, జీవో నంబర్ 3పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు వేంకగారి భూమయ్య డిమాండ్ చేశారు.

ఆదివాసీ, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. జీవో నంబర్ 3 రద్దుతో ఉద్యోగ అవకాశాలు కోల్పోతామని అన్నారు. జీవో నంబర్ 3 కోసం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు.

ఇవీ చూడండి:గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేనా..?

Last Updated : Jun 9, 2020, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.