ETV Bharat / state

వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతాలివ్వాలి: టీఎస్ యూటీఎఫ్ - కేజీబీవీ సమస్యల సాధనకు టీఎస్ యూటీఎఫ్ పోరాటం

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పని చేస్తోన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ సంఘం డిమాండ్​ చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, జూనియర్​ కళాశాల ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు.

tsutf demand for sovle kgbv teachers in nirmal district
వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతాలివ్వాలి: టీఎస్ యూటీఎఫ్
author img

By

Published : Jan 21, 2021, 2:02 PM IST

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను బలోపేతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు దాసరి శంకర్​ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కనీస వేతనాన్ని అమలు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, జూనియర్​ కళాశాల ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు.

కేజీబీవీల్లో పని చేసే ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ముస్తాఖ్ బేగ్ అన్నారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగానే కేజీబీవీలలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా టీచర్లకూ సెలవులు మంజూరు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 29న కలెక్టరేట్ ఎదుట సామూహిక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అధికారులకు అభినందనలు: ఎమ్మెల్సీ కడియం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.