నిర్మల్ జిల్లా సోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడ్తాల్ సమీపంలో సాగర్ కన్వెన్షన్ హాల్ వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. కారు-ఆటో ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న సోన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కుబీర్ మండలానికి చెందిన గణేశ్ నాయక్, సునీతలుగా పోలీసులు నిర్ధారించారు.
ఇవీ చూడండి: ఈఎస్ఐ స్కాం: 23 మంది ఇళ్లలో అనిశా సోదాలు