నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని వడోనా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందాడు. మహారాష్ట్రలోని రత్నేల్లి గ్రామానికి చెందిన దత్తరాం అనే వ్యక్తి ఇక్కడ భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసుకుంటున్నాడు. పొలంలో ఇనుప అరకతో కలుపు తీసే సమయంలో విద్యుత్ తీగలు తగలటం వల్ల అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు.
ఇవీచూడండి: మద్యం మత్తులో డ్రైవర్..ముగ్గురు విద్యార్థులు మృతి