కరోనా మహమ్మారి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 21 వేలు చెల్లించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పింఛను, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. కొవిడ్‌తో మరణించిన ఆశా వర్కర్లకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగామణి, భాగ్యలక్ష్మి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి: బంగాల్లో మంత్రివర్గ విస్తరణ- 43మంది ప్రమాణం