కేంద్ర ప్రభుత్వ మంత్రులంతా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి మెచ్చుకున్నారని తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి తెలిపారు. ఇంటింటికీ నీళ్లందించేందుకు తీసుకొచ్చిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో ఒక నవోదయ, మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకు అవార్డులు, ప్రశంసలు వస్తున్నాయే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు రావట్లేదని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి తెలిపారు.
ఇవీ చూడండి: గద్వాలలో ఉద్రిక్తత... పోలీసులపై రైతుల రాళ్లదాడి