ETV Bharat / state

టెండర్లు పిలవడం అంతరిక్ష సమస్యా?.. బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బందిపై కేటీఆర్ ఫైర్ - బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బందిపై కేటీఆర్ ఫైర్

KTR at Basara IIIT Convocation : బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులకు భోజనం తీరుపై మంత్రి కేటీఆర్‌ అధికారులకు చురకలంటించారు. నాణ్యమైన భోజనం అందించేందుకు టెండర్లు పిలవడం ఏమైనా అంతరిక్ష సమస్యనా... అని అధికారులపై ఫైర్ అయ్యారు. బాసర ఆర్జేయూకేటీ స్నాతకోత్సవానికి మంత్రులతో కలిసి హాజరైన ఆయన.... గతంలో విద్యార్థులకు తాను ఇచ్చిన హామీల్లో పురోగతిపై అధికారులను ఆరా తీశారు.

KTR at Basara IIIT Convocation
KTR at Basara IIIT Convocation
author img

By

Published : Dec 10, 2022, 12:24 PM IST

KTR at Basara IIIT Convocation : బాసర ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవానికి ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బాసరకు వెళ్లిన మంత్రులకు ట్రిపుల్‌ ఐటీ వీసీ, డైరెక్టర్‌ వారికి స్వాగతం పలికారు. స్నాతకోత్సవానికి ముందు కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో వారు సమావేశమయ్యారు.

KTR fires on Basara IIIT staff over Poor quality food : మంత్రుల సమక్షంలో టీ-హబ్‌ ప్రతినిధులు, ఆర్జేయూకేటీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా 800మంది విద్యార్థులకు కేటీఆర్ చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు, యూనిఫాం అందజేశారు. ట్రిపుల్‌ ఐటీలో గతంలో తాను పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీల పురోగతిపై అధికారులతో ఆయన చర్చించారు. నాణ్యమైన భోజనం అందించే విషయంలో అధికారుల సమాధానాలకు మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించేందుకు టెండర్లు పిలవడం ఏమైనా అంతరిక్ష సమస్యనా... అని అధికారులపై ఫైర్ అయ్యారు.

అధికారులతో సమావేశం అనంతరం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలతో పాటు పలువురికి బంగారుపతకాలు అందజేస్తున్నారు. ఆర్జీయూకేటీ సిబ్బందికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్జీయూకేటీ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అవకాశాలు ఉన్నప్పుడు వినూత్నంగా ఆలోచించి ఆవిష్కరణలు చేయాలని సూచించారు.

"గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న అధ్యాపకులకు అభినందనలు. సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదు. కంప్యూటర్లే మానవ మేథస్సును అధ్యయనం చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ కీలకపాత్ర పోషిస్తున్నాయి. విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలి. విశ్వవిద్యాలయాలు డిజైనింగ్‌ కోర్సులకు రూపకల్పన చేయాలి. విద్య, పరిశ్రమలకు తెలంగాణ గమ్యస్థానంగా మారింది. ప్రపంచంతో పోటీపడే సత్తా సంతరించుకుంటే ఆపగలిగేవారుండరు. ఆర్థికస్థోమత లేక అవకాశాల్ని అందుకోలేకపోయే పరిస్థితులుండొద్దు." - కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.