Insects in Basara IIIT mess: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విశ్వ విద్యాలయంలో మూడో రోజు సాలెపురుగు రావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులపాటు చోటుచేసుకున్న సంఘటనలు మరువక ముందే మరోసారి ఇలా జరగడం వారిని కలవరపెడుతోంది.
ఇదే విషయంపై విచారణ కోసం భైంసా ఆర్డీఓ లోకేశ్వర్ రావు మెస్‌ను సందర్శించారు. ఆయన సమక్షంలోనే అన్నంలో సాలెపురుగు రావడాన్ని ఆయన గుర్తించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆర్డీఓ పేర్కొన్నారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్ ప్రత్యూష ఆహార పదార్థాలను పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగిందని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: Insects in Basara IIIT mess: నిన్నటి కూరలో కప్ప.. నేడు తోకపురుగు..