జాతీయ రహదారిపై వాహన చోదకులు నిబంధనలు ఉల్లంఘిస్తే ఇకనుంచి జరిమానాలు కట్టాల్సిందేనని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు స్పష్టం చేశారు. పట్టణానికి ముఖద్వారమైన కడ్తాల్ వై జంక్షన్ వద్ద స్పీడ్ లేజర్ గన్ను ప్రారంభించారు. నేటి నుంచి జిల్లాలోని జాతీయ రహదారిపై పలుచోట్ల ఈ స్పీడ్ గన్లను అమర్చడం జరుగుతుందని వెల్లడించారు. సర్వీస్ రోడ్డు ఉన్న చోట ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నందున వాహనచోదకులు వేగాన్ని తగ్గించాలని సూచించారు. లేనిచో ఈ చాలన్ ద్వారా వారికి జరిమానా వేయటం జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రధాన కూడళ్లలో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు వివరించారు.
ఇవీచూడండి: తెరాస సభ్యత్వ నమోదుకు 69 మంది ఇన్ఛార్జ్ల నియామకం