ETV Bharat / state

Borigam Village: బోర్లు లేని బోరిగాం.. అయినా రెండు పంటలకు పుష్కలంగా నీరు

Borigam Village: సహజ వనరులు ఏవైనా అవసరం మేరకు వాడితే కలకాలం ఉంటాయి. అత్యాశకు పోయి వినియోగిస్తే కొంతకాలానికే దాని దుష్ప్రభావాలు కనిపిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకొనే నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు ఒక కట్టుబాటు చేసుకుని నిష్ఠగా పాటిస్తున్నారు. భూగర్భ జలాలను సహజ పద్ధతిలో వినియోగిస్తూ వారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండు కాలాలు పంటలు సాగుచేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అసలు ఆ కట్టుబాటు ఏంటి? దానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం.

Borigam Village:  బోర్లు లేని బోరిగాం.. అయినా రెండు పంటలకు పుష్కలంగా నీరు
Borigam Village: బోర్లు లేని బోరిగాం.. అయినా రెండు పంటలకు పుష్కలంగా నీరు
author img

By

Published : Jan 2, 2022, 6:29 PM IST

Borigam Village: బోర్లు లేని బోరిగాం.. అయినా రెండు పంటలకు పుష్కలంగా నీరు

Borigam Village: మనం బాగుంటే చాలు పక్కవాళ్లు ఏమైతే మనకేంటి అనుకునే వ్యక్తులు ఎక్కువగా కనిపించే రోజులివి. ఎక్కడైనా ఎవరి స్వార్థం వారిదే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము బాగుండాలనీ, తమ వల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే వినూత్న ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు. వారే నిర్మల్ జిల్లా లక్షణచాంద మండలం బోరిగాం గ్రామస్థులు. అతిముఖ్యమైన భూగర్భ జలాలను సహజ పద్ధతిలో వినియోగిస్తూ పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

కట్టుబాటుని నిష్ఠగా పాటిస్తూ...

ఆ గ్రామంలో నివాసగృహాలు 200 ఉన్నాయి. దానికి పోటీగా అక్కడ వ్యవసాయ బావులు 150కి పైగా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో ఐదారు అడుగుల లోతులోనే నీరు ఉంటుంది. కారణం ఏమిటంటే బోరుబావులకు దూరంగా ఉంటూ ఇప్పటికీ అక్కడ ఊట బావులతో వ్యవసాయం చేస్తున్నారు. ఊరంతా కట్టుబాటుచేసుకొని నిష్ఠగా పాటిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ ఊరిలో ఒక్క బోరు లేకపోవడం గ్రామస్థుల ఐక్యతకు నిదర్శనంగా చెప్పుకోవాలి. గవర్నమెంట్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్స్ నిర్మాణానికి సైతం ఈ బావుల నీరే వాడారు. తాగడానికి మాత్రమే అక్కడ రెండు బోరు బావులు, చేతి పంపులు ఉన్నాయి.

ఖర్చుకు వెనుకాడరు..

గ్రామంలో బోరుబావులు తవ్వించవద్దన్న గ్రామ కట్టుబాటును ఇక్కడి రైతులు ధిక్కరించరు. గతంలో ఒక్కరిద్దరు బోరు వేసినా గ్రామస్థులంతా కలిసికట్టుగా వాటిని పూడ్చేశారు. బావి కోసం ప్రతి రైతు రూ.లక్షలు ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. సాధారణంగా పంట చేలల్లో బోరు వేయిస్తే రూ.లక్ష లోపు ఖర్చవుతుంది. అదే వ్యవసాయ బావిని తవ్విస్తే లోతును బట్టి దాదాపు రూ.2 నుంచి 5 లక్షల దాకా వ్యయమవుతోంది. ఇప్పటి వరకైతే మండు వేసవిలో సైతం ఎలాంటి నీటి ఎద్దడి పరిస్థితులు రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో రెండు పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు.

ఒక వైపు చదువు.. మరో వైపు వ్యవసాయం..

"నాకు తెలివి వచ్చినప్పటి నుంచి గత 20 ఏళ్లుగా వ్యవసాయం మీదనే ఆధారపడ్డాం. చదువుకుంటూనే మరో వైపు ఈ వ్యవసాయం చేస్తున్నాను. మా దగ్గర గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బోర్లు వెయ్యడం అనేది అసలు ఉండదు. మొత్తం ఊట బావులతోనే పంటలు పండిస్తాం. దీని ద్వారా వేసవిలోనూ మా బావులలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఈ కాలంలోనూ పత్తి, పసుపు, మక్క పంటలు పండుతాయి. ఒక నిబంధన ప్రకారం ఎవరూ బోర్లు వెయ్యరు. ఎవరైనా వేసినా గ్రామ కమిటీ కఠిన చర్యలు తీసుకుంటుంది. నేను ఇప్పుడు పసుపు వేశాను. దీనికి వారానికి ఒకసారి ఈ ఊటబావి ద్వారానే నీరందిస్తాను. ఈ ఒక్క బావి 24 గంటలు మోటార్ ఆన్ చేసినా 3 ఎకరాలకు నీరు అందిస్తుంది." -ప్రశాంత్, యువరైతు, బోరిగాం.

మా పూర్వీకులు పెట్టుకున్న దానినే అనుసరిస్తూ...

" నేను గత 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మా గ్రామంలో మొత్తం ఈ ఊట బావులతోనే సేద్యం చేస్తాం. ఎందుకంటే బోర్లు వెయ్యడం వల్ల భూగర్భ జలాలు తగ్గి బావులు ఎండిపోతాయి. చుట్టూ పక్కన గ్రామాల్లో మా పూర్వీకులు గమనించి ఈ కట్టుబాటు పెట్టారు. అదే నేటికీ మేము అనుసరిస్తున్నాం. దాంతో గ్రౌండ్ వాటర్ పైనే ఉంటుంది. పంటలు బాగా పండించుకోగలుగుతున్నాం. బోర్లు వెయ్యడం వల్ల ముఖ్యంగా ఒకరికి బోరు పడితే సమీపాన ఉన్నా బావులన్నీ ఎండిపోతున్నాయి. అందరికి అవి సక్సెస్ కాకపోవడం, నష్టపోవడంతో మేమందరం కలిసి ఈ కట్టుబాటు పెట్టుకొని పాత పద్ధతులనే పాటిస్తూ ఈ ఊటబావులతో వ్యవసాయం చేస్తున్నాం. మంచి లాభాలు వస్తున్నాయి." - అర్జున్ రెడ్డి, రైతు, బోరిగాం

ఎండాకాలంలోనూ పుష్కలంగా...

"నాకు ఒక 6 నుంచి 8 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో 3 బావులు ఉన్నాయి. వాటిద్వారానే పసుపు, పత్తి, మక్క పంటలు వేయగలుగుతున్నాను. అయితే మా ఊరి కట్టుబాటు ప్రకారం ఎవరైనా బోరు వేస్తే కొంత చెల్లించాలనే ఒక నిబంధన ఉంది. దాంతో ఎవరూ బోరు వేయట్లేదు. ఈ ఊట బావులతోనే పంటలు పండిస్తున్నాం. ఇప్పటికీ బావుల్లో నీళ్లు నిండుగానే ఉంటాయి. వీటికి తోడు మాకు 3 చెరువులు ఉన్నాయి. దాంతో ఈ బావులలో ఎండాకాలంలో సైతం నిండుగా నీరు ఉంటుంది. 20 సంవత్సరాల నుంచి ఇదే పాటిస్తున్నాం. " -నూకల చెన్నయ్య, రైతు, బోరిగాం

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.