సిక్కుల ఆరాధ్య దైవమైన గురునానక్ 550వ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు. స్థానిక బస్‌డిపో సమీపంలోని గురుద్వారాసింగ్ సభ కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ రీతిలో సిక్కులు మత గురువును ప్రార్థించారు. ధైర్యం, సాహసానికి ప్రతిరూపంగా గురునానక్‌ను కీర్తిస్తామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఇవీ చూడండి: ప్రమాదవశాత్తు ఎగిసిపడిన మంటలు.. హోటల్ దగ్ధం