నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధిలో రెండవ రోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారు భక్తులకు బ్రహ్మచారిని అవతారంలో దర్శనమిచ్చారు. కరోనా, హైదరాబాద్ వర్షాల దృష్ట్యా భక్తుల తాకిడి తగ్గింది. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యసాలు చేయించారు. దర్శనానికి వచ్చే భక్తులకు.. ఆలయ అధికారులు తగు సూచనలు చేస్తున్నారు.
21వ తేదన మూలనక్షత్రం సందర్భంగా అమ్మవారి పుట్టినరోజు కావడంతో ఆరోజు చిన్నారులకు ఉదయం 3 గంటల నుంచే అక్షరాభ్యాసాలు చేయనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాలు 25వ వరకు కొనసాగనున్నాయి.
- ఇదీ చూడండి: వరుణుడు పగబట్టాడా.. మరో భారీ వర్షసూచన