నిర్మల్ జిల్లా ముజ్గి గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించేందుకు తీర్మానం చేసుకున్నారు. గ్రామంలోని పలు వీధుల్లో సర్పంచ్ రాజమణి మల్లేశ్.. గ్రామ పంచయతీ సిబ్బందితో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. బాధితున్ని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌కు తరలించారు.
వ్యాధిగ్రస్తుడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. గ్రామంలోని కిరాణా దుకాణాలు, హోటళ్లను మూసివేయించారు. ప్రజలు కొవిడ్ నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని సర్పంచ్ రాజమణి సూచించారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్ర గవర్నర్‌కు కరోనా పాజిటివ్