ముఖ్యమంత్రి మనసు మారాలంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు హోమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలోని సమ్మె శిబిరంలో వేద మంత్రోచ్ఛరణలతో హోమం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, చిన్న జీయర్ స్వామి చిత్రపటాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆర్టీసీ కార్మికులు వేడుకున్నారు.
ఇదీ చూడండి: మోకాళ్లపై కూర్చొని భిక్షమెత్తుకున్న ఆర్టీసీ కార్మికులు