నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో అల్లర్లు చెలరేగాయి. పట్టణంలోని జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇందులో ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటు ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వారున్నారు.
వారిలో కొందరిని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయిస్తుండగా.. తీవ్రంగా గాయపడ్డ మరికొందరిని నిజామాబాద్‌కు, హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనలో పలు వాహనాలు, ప్రయాణ ప్రాంగణం ఎదుట దుకాణాలు దహనమయ్యాయి. డీఎస్పీ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను రప్పించారు. గుమిగూడిన వారందరినీ చెదరగొట్టారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. జిల్లా ఇంఛార్జీ ఎస్పీ విశ్వ వారియర్ భైంసా చేరుకుని సమీక్షించారు. ఏడాది క్రితం కూడా ఇక్కడ గొడవలు జరిగాయి.
ఇదీ చూడండి : వాహనం పల్టీ.. ఇద్దరు మృతి, మరో ఏడుగురికి గాయాలు