మహారాష్ట్రలోని ధర్మాబాద్ సమీపంలో ఉన్న ఆల్కహాల్ కర్మాగారం నుంచి గోదావరిలోకి విడుదలవుతున్న వ్యర్థాల పట్ల ఈటీవీ, ఈటీవీ-భారత్ ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. న్యాయ సేవ సంస్థ అధికారులు స్పందించారు. నిర్మల్లోని జిల్లా అదనపు న్యాయస్థానంలో న్యాయమూర్తి జస్టిస్ జీవన్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ రామలింగంతో కలిసి వివరాలు వెల్లడించారు. కర్మాగార నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల నది పరీవాహక ప్రాంతాలైన బైంసా, నిర్మల్ ప్రాంత ప్రజలకు, మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఎంతో మంది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్న దృష్ట్యా.... న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఈ మేరకు సుమోటోగా కేసు నమోదు చేశారు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలోని కాలుష్య నియంత్రణ, పర్యావరణ అభియంతకు ఈ నెల 11 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశామన్నారు.
ఇదీ చూడండి: అహ్మదాబాద్లో 'అభినందన వినాయకుడు'!