ETV Bharat / state

RGUKT: బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల - Basra RGUKT latest news

బాసరలోని రాజీవ్​గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్​జీయూకేటీ)కి ఈ ఏడాది 1,404 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేశారు.

RGUKT: బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

author img

By

Published : Aug 19, 2021, 3:22 PM IST

నిర్మల్​ జిల్లా బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది. బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,404 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో అత్యధికంగా మేడ్చల్​ జిల్లా విద్యార్థులు 100 సీట్లు సాధించగా.. అత్యల్పంగా ములుగు జిల్లా విద్యార్థులు 5 సీట్లు సాధించారు.

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10 జీపీఏ (GPA) సాధించిన విద్యార్థులకు బాసర ఆర్జీయూకేటీలో సీట్లు దక్కేవి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను రద్దు చేసి.. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. ఫలితంగా ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్థులకు 10 జీపీఏ వచ్చింది. ప్రస్తుత విధానం వల్ల ప్రతిభను గుర్తించడం కష్టమని భావించిన యూనివర్సిటీ.. పాలిసెట్ ద్వారా సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించింది.

ఆరేళ్ల పాటు పూర్తిగా ఉచిత విద్య..

ఈ నిర్ణయానికి ప్రభుత్వం అంగీకారం తెలపడంతో రాజీవ్​గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్​జీయూకేటీ) సీట్లను పాలిసెట్ (POLY CET) ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. గ్రామీణ పేద విద్యార్థులకు సమీకృత ఇంజినీరింగ్ కోర్సులు అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఆర్జీయూకేటీ.. ఇప్పటి వరకు సీట్లను పదో తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేశారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఇంజినీరింగ్ కలిపి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆర్జీయూకేటీ (RGUKT)లో ఉన్నాయి. ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్​లో ఈసీఈ, ఈఈ, సీఎస్ఈ, సివిల్, మెకానికల్, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు ఆరేళ్ల పాటు పూర్తిగా ఉచిత విద్యను అందిస్తారు.

ఏపీలో నాలుగు.. తెలంగాణలో ఒకటి..

ఆర్జీయూకేటీ సంస్థకు ఏపీలో 4 క్యాంపస్‌లు ఉండగా.. తెలంగాణలో నిర్మల్‌ జిల్లా బాసరలో ఒకే ప్రాంగణం ఉంది. గ్రామీణ విద్యార్థులకు వరంలాంటి ఈ విద్యాలయంలో సీట్లు పెంచడంతో పాటు అనుబంధంగా మరిన్ని ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వినతులు వస్తున్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు (ఇంటర్‌+బీటెక్‌)లో ప్రవేశాలు కల్పించే ఈ సంస్థ (బాసర)లో 1500 సీట్లు ఉండగా.. గత ఏడాది 40,158 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో సీటుకు సగటున 27 మంది పోటీపడ్డారు. ఈ 40 వేల మందిలో 10 జీపీఏ సాధించిన వారే 9 వేల మందికి పైగా ఉన్నారు. ప్రవేశాల సంఖ్య పరిమితంగా ఉండటంతో పది జీపీఏ వచ్చిన సుమారు 7,500 మంది విద్యార్థులకు విద్యాలయంలో సీటు లభించలేదు.

ఇదీ చూడండి: RGUKT: పాలిసెట్‌ ద్వారా ఆర్‌జీయూకేటీ సీట్ల భర్తీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.