నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. ముథోల్ సరిహద్దులోని ధర్మబాద్ రహదారిలో ఉన్న వాగు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వాగు చుట్టు పక్కల చేతికి వచ్చిన సొయా, పత్తి పంట నీట మునగడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు పంటపొలానికి వెళ్లి వంతెన అవతలి వైపు ఉండి పోయారు.
ఇదీ చదవండి: మరో మూడు రోజుల పాటు వర్షాలు