ETV Bharat / state

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు - తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్‌కు తెలుసు : ప్రియాంక గాంధీ - Priyanka Gandhi criticizes KCR

Priyanka Gandhi Election Campaign in Khanapur : కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయినా ప్రజల స్వప్నం నెరవేరలేదని ప్రియాంక గాంధీ ఆక్షేపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. యువతకు ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇవ్వలేదని.. కానీ ఆయన కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారని ఆమె దుయ్యబట్టారు.

Priyanka Gandhi
Priyanka Gandhi
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 1:40 PM IST

Updated : Nov 19, 2023, 2:02 PM IST

Priyanka Gandhi Election Campaign in Khanapur : తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ఇందిరా గాంధీ కృషి చేశారని.. ఆమె మరణించి 40 ఏళ్లు అయినా ఇప్పటికి ఆరాధిస్తున్నారని చెప్పారు. ఆదివాసీ సంస్కృతి ప్రపంచంలోనే అత్యున్నత సంస్కృతిని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని ప్రియాంక గాంధీ వివరించారు.

Priyanka Gandhi Comments on KCR : తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్‌కు తెలుసని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పేర్కొన్నారు. సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీ తమదని తెలిపారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియా గాంధీ (Sonia Gandhi) రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయినా ప్రజల స్వప్నం నెరవేరలేదని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంలో జీవితాలు మారతాయని ఉద్యమకారులు కలలు కన్నారని ప్రియాంక గాంధీ తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే - కులగణన చేపడతాం : రాహుల్​ గాంధీ

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం

Priyanka Gandhi Fires on BRS and BJP : యువతకు కేసీఆర్‌ ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. కానీ ఆయన కుటుంబంలో మాత్రమే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వనున్నట్లు.. అందులో పరీక్ష తేదీలు, ఫలితాల ప్రకటన తేదీలు ఉంటాయని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ వైఫల్యం వల్ల అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్‌ లేక ఎంతోమంది నిరాశ, నిస్పృహలో ఉన్నారని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

కేసీఆర్​ మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే - ఆయన మనవడిని కూడా మంత్రిని చేస్తాడు : రేవంత్ రెడ్డి

Telangana Assembly Elections 2023 : కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ఉద్యమకారుల కుటుంబంలో.. ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రియాంక గాంధీ వివరించారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు.. అదేవిధంగా పంటలకు మద్దతు ధర పెంచుతామని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. కాళేశ్వరం (Kaleshwaram project), మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు పెద్దలకే రుణమాఫీ చేస్తారని ప్రియాంక గాంధీ ఆక్షేపించారు.

కాళేశ్వరం, మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగింది

"రైతులు, కార్మికుల రుణాలను మాత్రం కేంద్రం మాఫీ చేయదు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కొన్ని కుటుంబాలే బాగుపడ్డాయి. తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి మోదీ మాట్లాడరు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు చేయాలని అధికారులను పంపుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎం కలిసే పనిచేస్తున్నాయి. బీజేపీ, ఎంఐఎంకు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది." - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం

Priyanka Gandhi on Telangana Congress Manifesto 2023 : కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని.. రైతుబంధు కింద రైతులకు ఎకరాకు రూ.15,000 ఇవ్వనున్నట్లు ప్రియాంక గాంధీ తెలిపారు. 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తామని.. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఉచితంగా ఇంటి స్థలంతో పాటు.. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు సాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.10 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పిస్తామని ప్రియాంక గాంధీ వెల్లడించారు.

తెలంగాణపై ఏఐసీసీ బృందాల ఫోకస్‌ - అభ్యర్థులతో సంబంధం లేకుండా తెరవెనుక రాజకీయం

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ (Congress Manifesto) అమలు చేస్తోందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. జిల్లాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు నిర్మిస్తామని చెప్పారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ అనేవారని.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రజలు ప్రశ్నించాలని ప్రియాంక గాంధీ సూచించారు.

Priyanka Gandhi Fires on BRS and BJP : 'బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్‌ మోదీ చేతిలో ఉంది'

కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో - ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ మాస్టర్ ప్లాన్

Last Updated : Nov 19, 2023, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.