నిర్మల్ జిల్లాలో భూసంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు.
భూసంబంధిత, రెవెన్యూ, దివ్యాంగుల పింఛన్లు, వైద్యసేవలు తదితర 46 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. జిల్లా భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో వర్షపు నీరు ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చూడండి: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలి: ఆర్.కృష్ణయ్య