ETV Bharat / state

తల్లడిల్లుతున్న పేగుబంధం.. కుమారుడిని కాపాడుకునేందుకు ఆపసోపాలు.. - telangana varthalu

భార్యాభర్తలిద్దరూ రెక్క ఆడిస్తే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. కుమారుడి వైద్యం కోసం ఉన్న ఆస్తిని, పొలాన్ని వాళ్లు ధారపోసుకున్నారు. అయినా... ఇంకా చికిత్స కోసం వైద్యులు రూ.12 నుంచి 15 లక్షల ఖర్చవుతుంది అనడం వల్ల ఆ భార్యాభర్తలు ఆందోళనకు లోనయ్యారు. దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని వేడుకుంటున్నారు.

తల్లిడిల్లుతున్న పేగుబంధం.. కుమారుడిని కాపాడుకునేందుకు ఆపసోపాలు

author img

By

Published : Oct 24, 2021, 11:38 AM IST

నవ యువకుడు.. కుటుంబానికి చేతికందొచ్చాడు. పెద్దగా అనారోగ్య సమస్యలేవీ ఎరగని అతడు అనుకోనిరీతిలో మంచానికే పరిమితమయ్యాడు. రోజురోజుకూ చిక్కి శల్యమవుతున్నాడు. పేగుబంధం కళ్లముందే కృశిస్తుంటే ఆ తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉన్నది ఊడ్చైనా రక్షించుకోవాలని తపనపడుతున్నా... చికిత్స కోసం స్థోమతకు మించి అవసరమవుతుండటం వల్ల నిస్సహాయంగా దేవుడిపై భారం వేశారు. మానవత్వమున్న వారెవరైనా ఆదుకోకపోతారా అని ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన దొనగిరి సాయికుమార్ దీనగాథ ఇది.

తలనొప్పిగా ఉందంటూ..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్​పేట్​కు చెందిన వంజరి కిషన్, పుష్ప దంపతులకు ముగ్గురు కుమారులు. తండ్రి దర్జీ కాగా తల్లి బీడీ కార్మికురాలు. పెద్దకుమారుడు సాయికుమార్​కు 27 సంవత్సరాలు. దాదాపు ఏడాది క్రితం వివాహమైంది. స్థానికంగా పొరుగుసేవల విధానంలో ఉద్యోగం చేస్తున్న ఈయన కొద్ది రోజుల క్రితం తలనొప్పిగా ఉందని ఇంట్లో చెప్పాడు. ఆ తర్వాత శ్వాసకు ఇబ్బంది ఏర్పడుతోందనే కారణంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. పలురకాల పరీక్షలు చేసి చివరకు మూత్రపిండాల సమస్య ఉందని గుర్తించారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఆసుపత్రికి చేరిన సాయికి ప్రస్తుతం రెండు మూత్రపిండాలు చెడిపోయాయని గుర్తించారు. చికిత్స పొందుతున్న సమయంలో న్యుమోనియా, కామెర్లు సైతం వ్యాపించాయని, కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఈయనకు ఇప్పటికే మందులు, పరీక్షలకు రూ.8 లక్షల వరకు ఖర్చయ్యాయని తండ్రి పేర్కొన్నారు.

తండ్రి ముందుకొచ్చినా..

రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో ప్రస్తుతం వారంలో మూడు సార్లు రక్తశుద్ధి (డయాలసిస్) చేస్తున్నారు. తప్పనిసరిగా మూత్రపిండం ట్రాన్స్​ప్లాంటేషన్​ చేయాలని వైద్యులు సూచించడంతో తండ్రి దాతగా మారేందుకు ముందుకొచ్చారు. అన్నివిధాలా పరీక్షించిన అనంతరం సరిపోతుందని తేల్చారు. తీరా.. చికిత్స చేయాలనుకునే సమయానికి బాధితుడి శరీరం సహకరించని స్థితికి చేరుకుంది. ఇతర రోగాలు సైతం చుట్టుముట్టడంతో వాటికి చికిత్స అందిస్తున్నారు. మరో రూ. 12 నుంచి 15 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశముందని వైద్యులు సూచించడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఉన్న కాస్త స్థలాన్ని తాకట్టు పెట్టి వడ్డీకి తీసుకొచ్చిన డబ్బు ఇప్పటివరకు జరిగిన చికిత్సకు ఖర్చయిందని అదనంగా ఎక్కడి నుంచి తేవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. ఎవరు కదిలించినా కుమారుడి దీనావస్థను తలచుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. విషయం తెలుసుకున్న మిత్రులు దాతల సాయం కోసం సామాజిక మాధ్యమంలో అభ్యర్థిస్తున్నారు.

నా కుమారుడిని బతికించండి

నేను వృత్తిరీత్యా దర్జీని మాకు పెద్దగా ఆస్తులు లేవు. చక్కగా ఉన్న నా కొడుకు అనుకోని రీతిలో మంచం పట్టాడు. ఎప్పుడూ అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. ఒకేసారి ఇన్ని చుట్టుముట్టాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. దాతలు స్పందించి మా కుమారుడిని బతికిస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. -కిషన్, బాధితుడి తండ్రి

ఇదీ చదవండి: moral stories in telugu: అమ్మలూ మీరు ఇలాగే చేస్తున్నారా.. ఓసారి ఆలోచించండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.