నిర్మల్ జిల్లా కుబీర్ మండలం భ్రమేశ్వర్ తండాలో గుడుంబా తయారీ కేంద్రంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. గుడుంబా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 200 లీటర్ల జాగర్ను ధ్వంసం చేశారు.
రెండు రోజుల నుంచి సమాచారం వస్తుండంటంతో ఈరోజు సోదాలు నిర్వహించామని కుబీర్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పపువ్వు, బెల్లం పానకం 200 లీటర్ల వరకు తయారు చేసి ఉందని, దాన్ని ధ్వంసం చేశామని వెల్లడించారు. ఇలాంటి వాటికి మళ్లీ పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.