నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మీ హాజరై... జ్యోతి ప్రజ్వలన చేసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. తమ పిల్లలను దేశ రక్షణకై తీర్చిదిద్దిన కుటుంబసభ్యులకు ఎప్పటికి దేశ ప్రజలు రుణపడి ఉంటారని జెడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. ఎల్లవేల ప్రజల కోసం పోలీసులు తమ శక్తి మించి శ్రమిస్తున్నారన్నారు. కరోన సమయంలోనూ దేశానికి కవచంలా నిలిచారని పేర్కొన్నారు.
దేశ రక్షణలో ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడిన వీరులని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ కొనియాడారు. వివిధ ఘటనల్లో దేశవ్యాప్తంగా 35 వేల మంది పోలీసులు అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. 1959లో లద్ధాఖ్‌లో చైనాతో జరిగిన యుద్ధంలో 17 మంది సైనికులు ప్రాణాలు ఫణంగా పెట్టి దేశాన్ని కాపాడారన్నారు. అనంతరం పోలీసు అమరవీరుల పాటల సీడీని ఆవిష్కరించి అమరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, జిల్లా అదనపు ఎస్పీ రాంరెడ్డి , డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: చైనా సైనికుడిని పీఎల్‌ఏకు అప్పగించిన భారత్