నిర్మల్ జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న 30 వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. వాహనాలకు.. నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ లేకుండా దర్జాగా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ ట్రాఫిక్ ఎస్సై దేవేందర్ హెచ్చరించారు. లాక్డౌన్ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. వాహనాల తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
లాక్డౌన్ మొదలైన నాటి నుంచి.. ఇప్పటి వరకు 142 వాహనాలను సీజ్ చేసినట్లు దేవేందర్ తెలిపారు. వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. ద్రువపత్రాలు కలిగి ఉండాలంటూ.. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు.
ఇదీ చదవండి: కొలువులతో స్వాగతం పలుకుతున్న ఐటీ సంస్థలు