నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచే అన్ని వీధుల్లోని ఇళ్లు, దుకాణాల్లో సోదాలు చేపట్టారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు పట్టణంలో మూడు సార్లు నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు ఏఎస్పీ కిరణ్ కారే తెలిపారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సోదాలు చేపట్టామని.. ఇప్పటి వరకు 400వరకు వాహనాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 157 వాహనాలు తమ అధీనంలో ఉన్నాయని అన్నారు. వాహనదారులు తమ వాహనం నంబరు ప్లేటు సరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: దేశంలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ : కిషన్ రెడ్డి