రేపు జరగబోయే మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు పూర్తి సమాయత్తమయ్యారు. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి నేతృత్వంలో మండలాల వారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు జరిగే కార్యాలయాల వద్ద మూడు అంచెల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో భారీ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండు రోజులు ఎన్నికల కోడ్ ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు తీయొద్దని తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: పుర ఎన్నికలకు 2 రోజుల్లో అధికారిక ప్రకటన...!