అల్లర్లకు సంబంధించి 6 కేసులు నమోదు
నిర్మల్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాల సేవలు నిలిపివేశారు. ఘర్షణకు సంబంధించి వదంతులను ప్రచారం చేయొద్దన్నారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రేంజీ ఐజీ ప్రమోద్ కుమార్ హెచ్చరించారు. అల్లర్లకు సంబంధించి 6 కేసులు నమోదు చేసినట్లు ఐజీ తెలిపారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 144 సెక్షన్ విధించామని వెల్లడించారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎన్నికలు నిర్వహించాలా లేదా అనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందన్నారు. నేతలు ప్రచారం చేసుకోవచ్చని.. కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదన్నారు. గత మూడు రోజులుగా భయాందోళనలకు గురైన భైంసా ప్రజలు ప్రశాంతత నెలకొనడం వల్ల ఊపిరి పీల్చుకుంటున్నారు. భాజపా కూడా ఇవాళ్టి బంద్‌ను ఉపసంహరించుకుంది.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: గద్వాల సంస్థానంలో పుర సమరం