ETV Bharat / state

ఆ ఆస్పత్రులు సీజ్​.. వైద్యులు సమ్మె.. రోగుల ఇబ్బందులు.. చివరికి..

నిర్మల్​ జిల్లాలో ప్రైవేట్​ వైద్యులు సమ్మెకు దిగారు. శస్త్రచికిత్సల ద్వారా ఎక్కువ ప్రసవాలు చేస్తున్నరన్న ఆరోపణతో దాడులు నిర్వహించిన వైద్యారోగ్య శాఖ అధికారులు 6 ఆస్రత్రులను సీజ్​ చేశారు. దానికి నిరసనగా.. ఆయా ఆస్పత్రులు పూర్తి వైద్య సేవలు నిలిపేశారు. ఫలితంగా.. సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

patients-faced-problems-for-hospitals-seized-in-nirmal-and-bodhan

author img

By

Published : Mar 30, 2022, 8:46 PM IST

ప్రభుత్వ వైద్య అధికారులకు, ప్రైవేట్ వైద్యులకు మధ్య వివాదం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శస్త్రచికిత్సల ద్వారా ఎక్కువ ప్రసవాలు చేస్తున్నారన్న ఆరోపణతో.. నిర్మల్, భైంసా పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం(మార్చి 29) రోజు దాడులు నిర్వహించి 6 ప్రైవేట్ ఆసుపత్రుల ఓపీ సేవలను సీజ్ చేశారు. దీనిపై ఐఎంఏ వైద్యులు అత్యవసర సమావేశం నిర్వహించి.. జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, వైద్య అధికారుల తీరుకు నిరసనగా వైద్య సేవలు పూర్తిగా నిలిపేశారు. సీజ్ చేసిన ఆస్పత్రులను తిరిగి ప్రారంభించే వరకు వైద్య సేవలు నిలిపేస్తున్నట్టు పేర్కొన్నారు. ఫలితంగా రోగులు ఇబ్బందులు పడ్డారు.

సీజ్​ చేసిన ఆయా ఆస్పత్రుల వద్ద ప్రసవాల కోసం వచ్చిన గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్మల్​లోని శ్రీ ఆదిత్య ఆసుపత్రిలో వైద్యులకు గర్బిణీ బంధువులకు డెలివరీ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. నార్మల్ డెలివరీ వద్దని సిజేరియన్ చేయాలని గర్భిణీ తరఫువాళ్లు కోరారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ ఆసుపత్రికి చేరుకున్నారు. బందువులకు నచ్చజెప్పే ప్రయత్నంచేశారు. శస్త్రచికిత్స చేసే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో.. బాధితులు నిజామాబాద్​కు వెళ్లారు. మరోవైపు.. స్వర్ణ ఆసుపత్రి వద్ద ఓ గర్భిణీని అధికారులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలో వైద్యసేవలు నిలిపివేశారని.. లోపలికి వెళ్లేందుకు వీల్లేదని చెప్పారు. గర్భిణీ కుంటింబీకులు కంట తడిపెడుతూ వేడుకున్నా లోపలికి అనుమతించలేదు.. కలెక్టర్ అనుమతి తీసుకురావాలన్నారు. కోపోద్రిక్తులైన బాధితులు.. గర్భిణికి ఏదైనా జరిగితే మీరే బాధ్యులంటూ రోడ్డుపై బైఠాయించటంతో.. ఆస్పత్రిలోకి అనుమతించారు.

చివరకు ఐఎంఏతో కలెక్టర్ సమావేశం నిర్వహించి సమస్యను సద్దుమణిగించారు. ఎవరికీ వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించాలని దాడులు నిర్వహించలేదని.. ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చక్రాధర్​ పేర్కొన్నారు. శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలు తగ్గించాలని సూచించినట్టు తెలిపారు. భవిష్యత్తులో అందరూ కలిడికట్టుగా పని చేసి తక్కువ శస్త్రచికిత్సలు జరుగుతోన్న జిల్లాలతో పోటీపడాలని సూచించారు. దీంతో.. సీజ్​ చేసిన ఆస్పత్రుల్లో తిరిగి వైద్య సేవలు ప్రారంభించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.