నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. పంటను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం నీటి పాలవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు. బలమైన గాలులకు దాదాపు పది ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.
లోకేశ్వరం మండలం కిష్టాపూర్‌లో షేక్ అన్వర్‌కు చెందిన మేకల మందపై పిడుగుపడింది. దాదాపు రూ. 2 లక్షల విలువైన మేకలు మృత్యువాత పడ్డాయి.
ఇదీ చదవండి: ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను: జానారెడ్డి