నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ ఉపాధ్యాయురాలు శశికళ పోషకాహారం అందజేశారు. గర్భిణులు, బాలింతలు తగు మోతాదులో పోషకాహారం తీసుకుంటే.. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. తాజా కూరగాయలు, పండ్లు, గుడ్లు తీసుకుంటే.. శరీరానికి పోషకాలు అందుతాయని చెప్పారు. స్థానికులను ఆకట్టుకునేందుకు రంగవల్లిలో పౌష్టికాహారం ఉంచి ముస్తాబు చేశారు.
- ఇదీ చూడండి: పెరిగిన బంగారం, వెండి ధరలు-నేటి లెక్కలివే...