నిర్మల్ మున్సిపాలిటీలో ఒప్పంద కార్మికులు తమను రెగ్యులర్ కార్మికులుగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని కోరారు. ఈ మేరకు పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. ఒప్పంద కార్మికులను రెగ్యులర్ చేయాలని ఆగస్టు 11న హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.
ఎన్నో ఏళ్లుగా పురపాలికలో పలు విభాగాల్లో చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నామని, తమ సేవలు గుర్తించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.24 వేలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
- ఇవీచూడండి: తెలంగాణ శాసనసభ, మండలి రేపటికి వాయిదా