నూతన వ్యవసాయ చట్టాలను కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే తీసుకువచ్చారని అఖిల భారత రైతు కూలీ సంఘం నిర్మల్ జిల్లా కార్యదర్శి జె.రాజు ఆరోపించారు. దిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా.. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. చట్టాలను రద్దు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
చట్టాలు రైతులకు ఏమాత్రం మేలు చేసేలా లేవని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నూతన్ పేర్కొన్నారు. అన్నదాతలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'చట్టం అమలైతే రైతులు కూలీలే'