ETV Bharat / state

'మా ఉద్దేశం జరిమానా కాదు.. ప్రజల సంతోషం' - నిర్మల్ లో lockdown

కొవిడ్​ కట్టడి చర్యల్లో భాగంగా నిర్మల్​ జిల్లాలో లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని ఎస్పీ ప్రవీణ్​ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద లాక్​డౌన్​ అమలును పరిశీలించారు.

Telangana news
నిర్మల్ న్యూస్
author img

By

Published : May 25, 2021, 3:33 PM IST

రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలు సీజ్​ చేసి వారిని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని నిర్మల్​ ఎస్పీ ప్రవీణ్​ కుమార్​ అన్నారు. కొవిడ్​ మహమ్మారి నుంచి ప్రజలకు కాపాడడమే తమ కర్తవ్యమని చెప్పారు. నిర్మల్​ జిల్లా కేంద్రంలో పలు ప్రధాన కూడళ్ల వద్ద లాక్​డౌన్​ అమలును ఆయన పరిశీలించారు.

లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం, జరిమానా విధిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 1268 వాహనాలు సీజ్​ చేసినట్లు వెల్లడించారు. అంతే కాకుండా మాస్కులు ధరించకుండా బయట తిరుగతున్న 961 మందిపై కేసులు నమోదు చేసి రూ.9,61,000 జరిమానా విధించడం జరిగిందని పేర్కొన్నారు. వాటితో పాటు డిజాస్టర్ మేనేజ్​మెంట్​, ఎపిడిమిక్​ డీసీజస్​ ప్రకారం మరో 17 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ప్రజలందరూ లాక్​డౌన్​ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు.

ఇదీ చూడండి: సేంద్రియ సేద్యంతోనే కల్తీలేని ఆహారం: నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.