ETV Bharat / state

'వలస కూలీలు అందోళన చెందాల్సిన పని లేదు' - lock down effect

ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలకు నిర్మల్​ జిల్లా సొన్​ మండలం గంజాల్​ టోల్​ప్లాజా వద్ద కలెక్టర్​ ఫారూకి, ఎస్పీ శశిధర్​ రాజు ఆహారం అందించారు. విధులే కాకుండా సమాజ సేవ చేస్తున్న పోలీసులను కలెక్టర్​ అభినందించారు.

nirmal district police distributing food to migrants
'వలస కూలీలు అందోళన చెందాల్సిన పని లేదు'
author img

By

Published : May 24, 2020, 4:58 PM IST

వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూకి భరోసానిచ్చారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యములో బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన వలస కూలీలు స్వస్థలాలకు బస్సుల్లో వెళ్లే క్రమంలో సోన్ మండలం గంజాల్ టోల్​ప్లాజా వద్ద ఆహార పొట్లాలు, పండ్లు, మాస్కులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కలెక్టర్, ఎస్పీ పంపిణీ చేశారు.

దారిలో ఆహారం దొరక్క ఆకలితో అల్లాడిపోతున్నవారికి ఆసరాగా పోలీసులు నిలవడం హర్షణీయమని కలెక్టర్​ అభినందించారు. కరోనా వ్యాధికి భయపడకుండా, మండుటెండలో విధులు నిర్వహిస్తూ... సమాజ సేవ చేస్తున్న పోలీసులను ప్రశంసించారు. పోలీస్ సిబ్బందికి శానిటైజర్, ఓఆర్ఎస్, మాస్కు, పండ్లను కలెక్టర్​ అందించారు.

nirmal district police distributing food to migrants
'వలస కూలీలు అందోళన చెందాల్సిన పని లేదు'

ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తి తగ్గితేనే ఆ పథకాలు సాధ్యం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.