నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి రూ. 25 లక్షలు నిధులు మంజూరు చేయాలని కోరుతూ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు.
ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'పండుగే కదా అని అజాగ్రత్తగా ఉంటే.. ఇక అంతే'