ETV Bharat / state

వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్​ సమీక్ష - paddy

నిర్మల్​ జిల్లా కలెక్టరేట్​లో వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్​ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మెుక్కజొన్న, వరి ధాన్యం దిగుబడిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహిస్తున్నందున పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు.

nirmal collector review with agriculture officers
వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్​ సమీక్ష
author img

By

Published : May 13, 2020, 7:47 PM IST

మండలాల వారీగా మొక్కజొన్న, వరి ధాన్యం నివేదికను గురువారం సాయంత్రంలోగా ఇవ్వాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో మొక్కజొన్న, వరి ధాన్యం దిగుబడిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈనెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నందున పూర్తి సమాచారంతో వీడియో కాన్ఫరెన్స్​కు సన్నద్ధంగా ఉండాలన్నారు.

గ్రామాల వారీగా భౌగోళిక విస్తీర్ణం, సాగు విస్తీర్ణం, పండించే పంటల వివరాలు, పంటల సరళీ, ప్రతి గ్రామంలో సాగుచేస్తున్న రైతుల సంఖ్య, వరి ధాన్యం కొనుగోలు వివరాలు తదితర నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఉద్యానవన శాఖ అధికారి శరత్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలిచిన ఇద్దరు చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.