నిర్మల్ జిల్లాలో బ్యాంకుల వారీగా నిర్దేశించిన వార్షిక రుణప్రణాళిక లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 2020-21 వార్షిక సంవత్సరానికి గానూ రూ.9730.57 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను రూపొందించామన్నారు. వ్యవసాయ రుణాలు రూ.2178.08కోట్లు కాగా... ఇందులో పంట రుణాలు రూ.1646.45 కోట్లు, చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రూ.195.98కోట్లు, గృహ రుణాలకు రూ.62.40కోట్లు, విద్యా రుణాలకు రూ.36.48 కోట్లను ఆర్థిక సహాయం అందించేందుకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ పథకం కింద అర్హులైన వారందరికీ ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో రుణాలను అందించాలని బ్యాంకు అధికారులకు సూచించారు. అనంతరం 2020-21 వార్షిక రుణప్రణాళిక బుక్ లెట్‌ను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
ఇవీ చూడండి: 'దళారులు, నాయకులను నమ్మకుండా పనిచేయాలి'