ETV Bharat / state

ఆర్టీసీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టండి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అక్రమ ప్రైవేటు వాహనాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. ప్రయాణ ప్రాంగణాల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.

nirmal collector review meeting on rtc
ఆర్టీసీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టండి: కలెక్టర్
author img

By

Published : Apr 2, 2021, 11:49 AM IST

ఆర్టీసీ పరిరక్షణ, అభివృద్ధి కోసం తగిన చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ అన్నారు. గురువారం స్థానిక పాలనా ప్రాంగణంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్​తో సమావేశమయ్యారు. నిర్మల్‌, భైంసా డిపోల పరిధిలో ప్రైవేటు వాహనాలతో జరుగుతున్న నష్టాలపై సమీక్షించారు.

పరిమితికి మించి ప్రయాణికులతో నడుపుతున్న ప్రైవేటు వాహనాలు, స్టేజ్‌ కారేజీలుగా తిరుగుతున్న బస్సులపై రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు. ప్రయాణ ప్రాంగణాల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. సిబ్బంది విధిగా యూనిఫారాలు ధరించాలన్నారు. డీఎస్పీ ఉపేంద్రారెడ్డి, రీజినల్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌, డివిజనల్‌ మేనేర్‌ పి.రమేశ్‌, అధికారులు సింగ్‌, నాతులాల్‌, ఆంజనేయులు, రవీందర్‌, అమృత, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కేంద్రం ముందుడుగేస్తేనే- రైతాంగానికి జీవన భద్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.