ETV Bharat / state

రైతుల పట్ల అదనపు కలెక్టర్ దురుసు ప్రవర్తన

నిర్మల్​ జిల్లా సారంగపూర్​ మండలానికి చెందిన రైతులపై జిల్లా అదనపు కలెక్టర్​ భాస్కర్​ రావు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ధాన్యం తరలింపులో సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని కలెక్టర్​కు ఫిర్యాదు చేసినందుకు అదనపు కలెక్టర్​ రైతులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. బహిరంగంగా తిట్టారు.

Nirmal Additional Collector Scolded Former's
రైతులపై.. అదనపు కలెక్టర్ ఆగ్రహం
author img

By

Published : Jun 2, 2020, 11:20 PM IST

నిర్మల్​ జిల్లా సారంగాపూర్​ మండలం కంకట గ్రామ రైతులతో జిల్లా అదనపు కలెక్టర్​ భాస్కర్​ రావు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ధాన్యం తరలింపు విషయంలో కొనుగోలు కేంద్రం సిబ్బంది రైతులను డబ్బులు అడుగుతున్నారని జిల్లా కలెక్టర్ ముషారఫ్​ అలీకి ఫిర్యాదు చేసినందుకు అదనపు కలెక్టర్​ రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకట గ్రామంలో కంటైన్మెంట్​ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్​ ముషారఫ్​ అలీ దృష్టికి ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది డబ్బులు అడిగిన విషయాన్ని తీసుకొచ్చారు.

మండలంలో కలెక్టర్​ పర్యటన విషయాన్ని తెలుసుకున్నన కలెక్టర్​ అక్కడికి చేరుకున్నారు. కలెక్టర్​ సమక్షంలోనే రైతులు మరోసారి ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరు డబ్బులు వసూలు చేసినా.. కేసులు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్​ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కలెక్టర్​ వెళ్లిపోయిన తర్వాత అదనపు కలెక్టర్​ అక్కడే ఉన్న రైతులను పరుష పదజాలంతో దూషించారు. వీడియో తీసే ప్రయత్నం చేసిన మీడియాపై కూడా చిర్రుబుర్రులాడారు. దీంతో రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తే తాము ఎవరికి చెప్పుకోవాలి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్​ భాస్కర్​ రావు వ్యవహారంపై జూన్​ 3న కలెక్టర్​కు ఫిర్యాదు చేయనున్నట్టు రైతులు తెలిపారు.

ఇదీ చదవండి: 'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.