నిర్మల్ జిల్లావ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణపై పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ పథకం అమలు చేస్తోందన్నారు.
అనధికార లే అవుట్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ పథకం కింద ప్లాట్లను అక్టోబరు 15 లోగా క్రమబద్ధీకరణ చేసుకునేలా చర్యలు చేపట్టాలని హేమంత్ సూచించారు. ఇప్పటికే గుర్తించిన అక్రమ లే అవుట్ల భూ యజమానులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు.
ఇదీ చూడండి : 'రేపటి నుంచే వక్ఫ్ భూముల్లో లావాదేవీలు నిషేధం'