ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. స్వదేశానికి తిరిగొచ్చారనే వార్త నిర్మల్ జిల్లా వాసులను భయబ్రాంతులకు గురిచేసింది. కరోనా సెకండ్‌వేవ్ మొదలవుతోందన్న వార్తల నేపథ్యంలో.. బ్రిటన్ నుంచి వచ్చే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ స్పందించింది.
బ్రిటన్‌లో కొత్త వైరస్ లక్షణాలు వెలుగు చూడటంతో అప్రమత్తమైన అధికారులు అనుమానితుల రక్త నమూనాలు సేకరించారు. నిర్ధారణ పరీక్షలు జరిపి కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఆ మేరకు జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వైద్యాధికారి ధనరాజ్.. వారిరువురిని హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా కోరారు. ఈనెల 13వ తేదీన ఒకరు, 19న మరొకరు స్వదేశానికి వచ్చారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'కొవిడ్ సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తత అవసరం'