ETV Bharat / state

Laxmipur Lift Irrigation Project : లక్ష్మీపూర్ ఎత్తిపోతల సహా 23 అభివృద్ధి పనులకు కేంద్రం ఆమోదం

Laxmipur Lift Irrigation Project on Kadem Project : గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఆమోదం పొందిన లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకానికి.. తాజాగా కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన 23 అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు వల్ల చుట్టు పక్కల గ్రామాల్లో 3500 ఎకరాలకు సాగు నీరు అందనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Laxmipur Lift Irrigation Project in Nirmal

author img

By

Published : Jul 18, 2023, 9:02 PM IST

Laxmipur Lift Irrigation Project in Nirmal : కడెం ప్రాజెక్టుపై లక్ష్మీపూర్ ఎత్తిపోతల సహా రాష్ట్రానికి చెందిన రహదార్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ప్రతిపాదనలకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. దిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించిన 23 అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మిద్దామనుకున్న.. లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకానికి వైల్డ్ లైఫ్ బోర్డ్ అనుమతులు ప్రకటించింది. సాగునీటి శాఖ ప్రతిపాదనలను పరిశీలించి అటవీశాఖ నిబంధనల మేరకు అనుమతులు జారీ చేసింది.

National Wild Life Board Green Single 23 Development Programmes : ఎత్తిపోతల కోసం 3.17 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు బోర్డు అంగీకరించిందని..ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి - పీసీసీఎఫ్ ఆర్​ఎం డోబ్రియాల్ పేర్కొన్నారు. దీంతో పాటు తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో రహదార్ల నిర్మాణం, వాటి వెడల్పునకు సంబంధించిన 11 ప్రతిపాదనలు.. ఐదు పంచాయతీరాజ్ రోడ్లకు, కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ డివిజన్​లో విద్యుత్ లైన్ ప్రతిపాదనకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదం తెలిపింది.

Gudem Lift Irrigation Project : గూడెం ఎత్తిపోతల, మోడికుంట వాగు ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఆమోదం

గతంలో ఈ ప్రాజెక్ట్​కి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇలా : నిర్మల్‌ జిల్లాలో లక్ష్మీపూర్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరంలో ఆగస్టు నెలలో అనుమతి ఇచ్చింది. కడెం ఎడమ గట్టున పాండ్వపురి వంతెన సమీపంలో ఈ పథకాన్ని కట్టనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపూర్‌ ఎత్తిపోతల నిర్మించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ.. నీటి పారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 0.23 టీఎంసీల నీటి వినియోగం కోసం రూ.40.1 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల నిర్మాణం చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్​ నిర్మించడం వల్ల లక్ష్మీపూర్​తో పాటు దోస్తునగర్​, నవాబుపేట్​, ఆకొండపేట్​ గ్రామాల్లోని 3500 ఎకరాలు సాగులోకి రానున్నదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్ట్​ను రైతుల అభివృద్దికి తోడ్పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. ఈ ప్రాజెక్ట్​కి నిధులు అంచనా వేసిన ప్రకారమే ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును అడిగిన వెంటనే.. నిర్మాణానికి అంగీకరించడం సంతోషమనం గతంలో బీఆర్​ఎస్​ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రజెక్టు నిర్మాణంలో సాకేతికంగా ఎటువంటి లోపాలు తలెత్తుకుండా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం పేర్కొంది. ఇది నిర్మాణం పూర్తి అయితే చుట్టు పక్కల గ్రమాలకి పంట పండించేందుకు నీరు సమృద్ధిగా లభిస్తుందని.. భూగర్భ జలాలు పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశా భావం వ్యక్తం చేసింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.