కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సీఎఎ, ఎన్ఆర్సీ బిల్లులను వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ముస్లింలు మానవహారం చేపట్టారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం జాతీయ రహదారి పక్కన ఈ ప్రదర్శన చేపట్టారు. స్థానిక శ్యాంఘడ్ నుంచి బైల్ బజార్ వరకు జాతీయ రహదారి పక్కన నిలబడి శాంతియుతంగా నిరసన తెలిపారు. పట్టణ పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఇవీ చూడండి: త్వరలో టీస్బీపాస్ తీసుకొస్తాం: కేటీఆర్