నిర్మల్ జిల్లాలోని ముథోల్ మండలం ముద్గల్‌లో ఆగ్రోఫారెస్ట్రీ పట్టు పురుగుల పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉద్యానవన, పట్టు పరిశ్రమల సంస్థ సంచాలకులు వెంకట్రామిరెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పాల్గొన్నారు. ముద్గల్ నర్సరీని వెదురు హబ్‌గా మారుస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాయితీపై రైతులకు వెదురు, మల్బరీ, శ్రీగంధం మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులకు పంటలపై అవగాహన కల్పించి రాయితీలు అందేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: కిడ్నాపర్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష నజరానా